TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్‌లో మత్తు ఇంజెక్షన్ తీసుకున్న ఇంటర్ విద్యార్ధి మృతి

Published on: Mon Apr 21, 2025 4:19PM

 

హైదరాబాద్ బాలనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఇంటర్ విద్యార్ధి మృతి చెందాడు. ఇంజక్షన్‌తో పాటు టాబ్లెట్లను ఒకేసారి తీసుకోవడంతో డోస్ ఎక్కువైంది. ఈ క్రమంలో నాసర్ అనే విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులు పరిస్థితి విషమంగా ఉంది. సదరు విద్యార్ధులకు మెడికల్ డ్రగ్స్ అమ్మిన సాహిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నరు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డ్రగ్స్, మత్తు పదార్థాల వాడకం, సరఫరాపై ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌లో కొందరు యువకులు మత్తు ఇంజెక్షన్‌లు, మరియు డ్రగ్స్ సొంతగా వినియోగించడమే కాకుండా ఇతరులకు అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగిస్తున్న, సరఫరా చేస్తున్న వారిలో ఎక్కువగా విద్యార్థులే ఉంటున్నారని ఇటీవల గణాంకాలు వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఓ ఘటన ఇందుకు మరో ఉదాహరణగా నిలిచింది.సదరు వ్యక్తి మత్తు మాత్రలు, ఇంజెక్షన్ లను విక్రయిస్తున్నాడు? అతని వద్దకు మత్తు ఇంజెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎంత మందికి విక్రయిస్తున్నారు? అనే కోణాల్లో ను బాలాపూర్ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.