TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎంఎంటీఎస్‌ యువతి రేప్ కేసులో..బిగ్ ట్విస్ట్

Published on: Fri Apr 18, 2025 4:24PM

హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్‌లో యువతిపై అత్యాచారయత్నం ఘటనపై బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. అసలు సదరు యువతిపై లైంగిక దాడి జరగలేదని పోలీసు ఎంక్వైరీలో తేలింది. రైలులో వెళ్తూ ఇన్‌స్టా రీల్స్ చేసిన ఆమె ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ విషయాన్ని ఇంట్లో చెబితే తిడతారని  అత్యాచారం జరిగింది అంటూ ఆ యువతి కట్టుకథ అల్లింది. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 100 మంది అనుమానితులను విచారించారు. వారు చెప్పిన విషయాలతో కంగుతిన్న అధికారులు 250 సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి యువతిని విచారించగా ఆమె చెప్పిన సమాధానాలతో పోలీసులకు అనుమానం మొదలైంది. 

ఇక వారు తమ స్టైల్లో విచారణ జరపగా ఆ యువతి అసలు విషయం చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుండగా కింద పడ్డానని.. తనపై అత్యాచారం జరగలేదని.. చెప్పడంతో నిజానిజాలు నిర్ధారించిన పోలీసులు ఈ కేసు క్లోజ్ చేశారు.అసలు ఆమెపై అత్యాచారమే జరగలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. యువతి అధికారులకు అబద్ధం చెప్పినట్లు తెలిసింది. ఈ కేసులో రైల్వే పోలీసులు చేపట్టిన లోతైన దర్యాప్తులో సంచలన  విషయం వెలుగులోకి వచ్చింది.