Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం
posted on: Jul 18, 2025 3:43PM
.webp)
హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. గచ్చిబౌలి, కొండాపూర్ హైటెక్ సిటీ, జూబిలీహిల్స్, బంజారహిల్స్, యూసఫ్ గూడ, మధురానగర్, అమీర్‌పేట్, సనత్‌నగర్, ఎర్రగడ్డ, ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. డ్రైనేజీ రోడ్లపై పొంగి పొర్లుతోంది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. వాహనదారులు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకొని ఇబ్బందులు పడ్డుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు హైడ్రా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
తెలంగాణలో రెండు రోజుల పాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం వరకు ఉరుములు మెరుపులతో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నాది. శుక్రవారం వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి, ఉమ్మడి నల్గొండ, నాగర్‌కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం హనుమకొండ, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీవర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.



.webp)


