TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కార్తీకరెడ్డి రాజీనామా ఆమోదం

Published on: Sat Dec 17, 2011 2:08PM

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగరపాలక సంస్థ మేయర్‌ బండ కార్తీకరెడ్డి రాజీనామాను పాలకవర్గం ఆమోదించింది.శనివారం  జరిగిన పాలకవర్గ ప్రత్యేక సమావేశంలో కౌన్సిల్‌ మేయర్‌ రాజీనామాను ఆమోదిస్తూ తీర్మానం చేసింది. తన రాజీనామాపై చర్చించి, తగు నిర్ణయం తీసుకోవాలని కార్తీకరెడ్డి కోరగా, కాంగ్రెస్‌,ఎంఐఎం, టీడీపీ, బీజేపీ పక్ష నేతలు అందుకు మద్దతు తెలిపారు. దీంతో తన రాజీనామా ఆమోదం పొందిందని కార్తీకరెడ్డి ప్రకటించారు. వ్యకితగత కారణాల వల్లనే మేయర్‌ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్టు ఆమె తెలిపారు. పలు అంశాల్లో మేయర్‌ వైఫల్యం చెందారని, అవినీతిపై చర్యలు తీసుకోలేకపోయారని, మతతత్వ పార్టీలతో స్నేహం చేస్తున్నారని బీజేపీ పక్ష నేత బంగారి ప్రకాశ్‌ తన ప్రసంగంలో పేర్కొనడం స్వల్ప వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ కార్పొరేటర్లు ఖండించారు. అధికారులు, కార్పొరేటర్లు కార్తీకరెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికారు.