TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ అంశంపై చంద్రబాబు మనస్సులోని మాట

Published on: Fri Dec 16, 2011 11:31AM

హైదరాబాద్: తెలంగాణ అంశంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన మనస్సులోని మాటను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వొద్దని తాను ఏనాడైనా చెప్పానా అంటూ తెలంగాణప్రాంత ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణవాదులను పునరాలోచనలో పడేశాయి. తెలంగాణకు చంద్రబాబు వ్యతిరేకం కాదంటే.. రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రధాన అడ్డంకి అనే విషయాన్ని వారు గ్రహించగలిగారు. అందుకే తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ కూడా చంద్రబాబు తెలంగాణ జిల్లాల పర్యటన పట్ల పెద్ద వ్యతిరేకతను వ్యక్తం చేయలేదు. బాబు పర్యటను టీ జేఏసీ అడ్డుకోవడం లేదని, ఒకవేళ అడ్డుకోమని ఎవరైనా పిలుపునిస్తే తక్షణం ఉపసంహరించుకోవాలని కోదండరామ్ అన్నారు. తెలంగాణా జిల్లాల్లో రైతు పోరుబాట పేరుతో చంద్రబాబు గత రెండు రోజులుగా పర్యటిస్తున్న విషయం తెల్సిందే. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లిలో జరిగిన బహిరంగ సభలో సభికులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. తెలంగాణపై కేంద్రం సరైన నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో అస్థిరతను తొలగించాలని డిమాండ్‌ చేశారు. పార్టీకి కొంతమంది నేతలు ద్రోహం చేసినా కార్యకర్తలు మాత్రం పార్టీని కాపాడుకున్నారంటూ చెప్పుకొచ్చారు. మొత్తం మీద తెలంగాణ పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ శ్రేణులతో పాటు.. తెలంగాణ వాదుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి.