TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్ర కాంగ్రెస్‌లో కలవరం

Published on: Tue Apr 3, 2012 11:28AM

హైదరాబాద్ :  సోనియా గాంధీకి పిసిసి అధ్యక్షుడు బొత్స లేఖ రాసిన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో కలవరం రేగింది. ఈ నేపథ్యంలో బొత్స నివాసంలో మంగళవారం డిప్యూటీ సిఎం రాజ నర్సింహా, మంత్రి డిఎల్‌ రవీంద్రా రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సంఘటనల నేపధ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో అసమ్మతి తారాస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది.

కాగా బుధవారం బొత్స, ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. మరోవైపు బొత్స తనకు ముఖ్యమంత్రికి ఎలాంటి విభేదాలు లేవని చెప్పటం విశేషం. తాను అధిష్టానానికి ఎలాంటి లేఖ రాయలేదని, హైకమాండ్ నుంచి తనకు పిలుపు రాలేదని చెబుతున్నారు.