TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ పార్టీకి ఎదురుదెబ్బ

Published on: Wed Mar 7, 2012 12:55PM

హైదరాబాద్: జగన్ కు వీర విధేయుడుగా ఉన్న రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ విప్ ను ధిక్కరించి స్పీకర్ వేసిన అనర్హత వేటుకు గురయ్యారు. ఇప్పుడు ఇయన జగన్ ఆదేశాలను కూడా ధిక్కరిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జరుగబోయే ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని చెబుతున్నారు. జగన్ ఆదేశించినప్పటికీ పోటీ చేయడానికి ఆయన ముందుకు రావడం లేదు. దీంతో కంగుతిన్న వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు మరో అభ్యర్ధికోసం వేట ప్రారంభించారు. ఓటమి భయంతోనే కాపు రామచంద్రారెడ్డి వచ్చే ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. ఆయన ఎమ్మెల్యేగా వున్న సమయంలో నియోజకవర్గ అభివృద్దికి పెద్దగా ఏమీ చేయలేదు. కార్యకర్తలను కూడా ఆకట్టుకోలేకపోయారు. దీనికితోడు అప్పట్లో నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు ఆయనను ఏకాకి చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఈ నేపధ్యంలో పోటీచేయకుండా ఉండటమే మేలని కాపు రామచంద్రారెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది.