జగన్ కు మాదిగల మద్దతు లేదు
Published on: Fri Mar 2, 2012 10:43AM
హైద
రాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్ కు మద్దతులిచ్చే రాజకీయ పార్టీలు సామాజిక వర్గాలు కరువయ్యాయి. సిపిఐ, సిపిఎంతో సహా ఏ పార్టీ ఆయనకు మద్దతు ఇవ్వడానికి ముందుకు రావడంలేదు. దీంతో మాల, మాదిగ, బిసి వంటి సామాజిక వర్గాల మద్దతుకోసం ఆయన ప్రయత్నించారు. అక్కడకూడా జగన్ కు నిరాశే ఎదురైంది. షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం మాల మాదిగలు జగన్ తో కలిసి రావాలని వైఎస్సార్ పార్టీ నాయకులు జూపూడి ప్రభాకరరావు బహిరంగంగానే పిలుపునిచ్చారు. అయితే మాల మాదిగలు ఎవరూ దీనికి సానుకూలంగా స్పందించడంలేదు. జగన్ కు ఏ విషయంలోనూ మద్దతు ఇవ్వబోమని ఎమ్మార్పీఎస్ నాయకులు మందా కృష్ణమాదిగ స్పష్టంచేశారు. కేవలం ముఖ్యమంత్రి కావడం అనే ఏకైక ఎజెండాతో పనిచేస్తున్న జగన్ కు తాము మద్దతునిచ్చే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.


