TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రైతులను ముంచిన మిర్చి

Published on: Thu Mar 1, 2012 12:56PM

హైదరాబాద్: రాష్ట్రంలోని మిర్చి రైతులను కష్టాలను వెంటాడుతున్నాయి. సాగు ఆరంభంలో నెలకొన్న వర్షాభావం అ తరువాత అకాల వర్షాలు మిర్చి రైతులకు కోలుకోలేని దెబ్బతీశాయి. దీనికి తోడు ఎరువులు, పురుగుల మందుల ధరలు భారీగా పెరగడంతో పెట్టుబడులు భారంగా మారాయి. చివరకు దిగుబడి తగ్గి రేటు లేక మిర్చి రైతు కుదేలయ్యాడు.గత ఏడాది ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ళ సగటు మిర్చి దిగుబడి వచ్చింది. నాణ్యతను బట్టి  క్వింటాలుకు ధర రూ.6 నుంచి 12వేల వరకు పలికింది. గత ఏడాది సేద్యం లాభసాటిగా ఉండటంతో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. దీంతోపాటు కష్టాలు పెరిగాయి. మిర్చి ధర దారుణంగా పడిపోయి నేడు రూ. 4 నుంచి 5 వేల మధ్య మాత్రమే క్వింటాలుకు లభిస్తోంది. అందులోనూ తాలుకాయలు ఎక్కువగా ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తెగుళ్ళ మందులకే ఎకరాకు రూ.3 వేలు ఖర్చుచేశారంటే తెగుళ్ళ ప్రభావం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు.