TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెల్లబోయిన పత్తి రైతు

Published on: Thu Mar 1, 2012 12:14PM

హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి రైతులు తెల్లబోతున్నారు. కష్టపడి పండించిన తెల్లబంగారానికి తగిన ధర రాకపోవడంతో దిగాలుపడుతున్నారు. గత ఏడాది క్వింటాల్ రూ.7 వేల వరకు అమ్మిన పత్తి, ప్రస్తుతం రూ.3500కి పడిపోయింది. అదే సమయంలో డిఎపి బస్తాధర రూ.1000కి పెరిగింది. ఖరీఫ్ లో కరవు, తుఫాను, అకాల వర్షాలతో పత్తిలో నాణ్యతా ప్రమాణాలు దిగజారాయి. ఈ ఏడాది ఎకరం పత్తి పండించడానికి రూ.40 వేల వరకు ఖర్చయింది. అంటే ఉత్పత్తి వ్యయం దాదాపు రెట్టింపయింది. ఎరువుల ధరలు ఐదుసార్లు పెరిగాయి. ధరల పతనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు సుమారు రూ.3000 కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీనికి తోడు కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. కౌలు రైతులు ఎకరం రూ.14 నుంచి రూ.16వేలకు కౌలుకు తీసుకుంటున్నారు. పత్తి ధర తగ్గడంతో ఎకరానికి రూ.15వేల నుంచి రూ.20వేల వరకు నష్టం వచ్చే అవకాశం ఉంది. దీంతో పత్తి రైతుల ఆత్మహత్యలు కూడా నమోదవుతున్నాయి. స్పిన్నింగ్, జిన్నింగ్, వీవింగ్ మిల్లులకు విద్యుత్ కోత ఇబ్బందిగా ఉంది. వారానికి నాలుగు రోజులు మాత్రమే మిల్లులు పనిచేస్తున్నాయి. గత ఏడాది వచ్చిన నష్టాల నుంచి రైతులు, వ్యాపారులు ఇంకా కోలుకోలేదు.