TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆదర్శ పాఠశాలలపై అనుమానం

Published on: Wed Feb 29, 2012 1:28PM

హైదరాబాద్: ప్రైవేటుకు ధీటుగా పేద విద్యార్ధులకు విద్యాబోధన చేసేందుకు ప్రభుత్వం సకల హంగులతో ఏర్పాటు చేయనున్న ఆదర్శ పాఠశాలల (మోడల్ స్కూల్స్) ప్రారంభం ప్రశ్నార్ధకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్షరాస్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేయాల్సి ఉంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ పాఠశాలల్లో క్లాసులు ప్రారంభం కావలసి ఉంది. కానీ ఇంత వరకు ఎక్కడా  పాఠశాలల నిర్మాణం జరగలేదు. అద్దె గృహాలను తీసుకుని పాఠశాలలు నడపడానికి కూడా ఇప్పటి దాకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కొత్త సంవత్సరం ప్రారంభానికి 5నెలల గడువు మాత్రమే ఉండటంతో ఈ మోడల్ స్కూళ్ళ  ప్రారంభంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పధకం కింద ఒక్కో పాఠశాల భవనం ఇతర సౌకర్యాల కల్పనకు మూడు కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. ఇంగ్లీష్ మీడియంలో 6 నుంచి 10+2 వరకు పాఠశాలల్లో చదువుకోవచ్చు. సెంట్రల్ సిలబస్ ఉండే ఈ పాఠశాలల్లో విద్యార్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఒక్కో పాఠశాలలో 15 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది పనిచేస్తారు. నిజానికి ఇది మంచి పధకమే అయినప్పటికీ ఆచరణలో మాత్రం అసాధ్యంగా కనిపిస్తోంది.