TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చావైనా బతుకైనా పరకాల ప్రజలతోనే - కొండా సురేఖ

Published on: Mon Feb 27, 2012 2:48PM

హైదరాబాద్:  తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పరకాల నియోజకవర్గ ప్రజలతోనే చావైనా బతుకైనా పంచుకుంటానని మాజీ మంత్రి శాసన సభ్యురాలు కొండా సురేఖ అంటున్నారు. పరకాల నియోజకవర్గంలోని గీసుకొండ ప్రజలతో 17 సంవత్సరాలు, ఆత్మకూరు మండల ప్రజలతో 12 సంవత్సరాల అనుబంధం తనకు ఉందన్నారు. కష్టకాలంలో అభిమానులు, ప్రజలు తమవెంట నడిచి వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ప్రజల ఆశీర్వాదం, ప్రేమ, ఆప్యాయతలతో మూడు రిక్దారులు సాధించామన్నారు. రాష్ట్రంలోనే ఏ మహిళా ఎమ్మెల్యేకు రానంతగా 44వేల మెజారిటీని నియోజకవర్గ ప్రజలు ఇచ్చారని, జిల్లాలోనే తొలి మహిళా మంత్రిగా పనిచేసిన ఘనత తనకే దక్కిందని అన్నారు.ఎన్ని కష్టాలు ఎదురైనా   నియోజకవర్గాన్ని విడిచిపోయేది లేదని ఆమె స్పష్టం చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని అభిమానులు, కార్యకర్తలు ప్రజల అభిమానం మేరకు 2014 ఎన్నికల్లో మురళీధరరావు పోటీచేస్తారని ఆమె ప్రకటించారు.