మున్సిపోల్స్ కు ముందు 'దీపం' తాయిలం
Published on: Mon Feb 27, 2012 1:50PM
హై
దరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లను దండుకునేందుకు ప్రభుత్వం దీపం గ్యాస్ కనెక్షన్లను తాయిలంగా ఇవ్వనుంది. ఈ కారణంగానే గత ఏడాది చివరి నాటికే రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయాల్సిన లక్షలాది గ్యాస్ కనెక్షన్లను ఇప్పటికీ ఇవ్వలేదని తెలుస్తోంది. 2011-12 ఆర్ధిక సంవత్సరానికి గాను రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల దీపం కనెక్షన్లు ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని గత ఏడాది డిసెంబర్ 31వ తేదీనాటికే లబ్దిదారులకు అందజేయాలి. ఈ మేరకు గత ఏడాది నవంబర్ 16న ఉత్తర్వులు జారీ చేశారు. గడువు ముగిసి రెండు నెలలు దాటుతున్నా ఇప్పటికీ దీపం కనెక్షన్లను పంపిణీ చేయలేదు. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా కనెక్షన్ల పంపిణీకి తాత్కాలికంగా ప్రభుత్వం బ్రేక్ వేసినట్లు తెలిసింది. ఎన్నికలను ముందు వీటిని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ పంపిణీ చేయడం ద్వారా లబ్ది పొందాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది.


