TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జూట్ పరిశ్రమకు విద్యుత్ షాక్

Published on: Mon Feb 27, 2012 1:43PM

హైదరాబాద్: రాష్ట్రంలోని జూట్ మిల్లులకు విద్యుత్ షాక్ తగిలింది. వేళాపాళా లేకుండా విద్యుత్ కోతలు విధించడంతో ఆ పరిశ్రమ కుదేలయింది. ఇప్పటికే నష్టాలతో నడుస్తున్న ఈ పరిశ్రమలు విద్యుత్ కోతల కారణంగా మూతపడే ప్రమాదం ఏర్పడింది. ఇదే జరిగితే రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు లక్షల కుటుంబాలు వీధిపాలయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ పరిశ్రమలను డీజిల్ జనరేటర్ తో నడపాలంటే యూనిట్ ఛార్జి రూ.17 వరకు అవుతోంది. అదే విద్యుత్ తో అయితే యూనిట్ కు రూ.4.80 అవుతోంది. ఇంత వ్యత్యాసంతో డీజిల్ జనరేటర్లపై ఆధారపడి పరిశ్రమ నడిపేకన్నా మూసివేస్తే మంచిదన్న యోచనలో జూట్ మిల్ యజమానులు ఉన్నారు.