TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సువర్ణభూమి లాప్ టాప్ ఇచ్చేయాలని సీబీఐకి కోర్టు ఆదేశం

Published on: Sat Feb 25, 2012 9:58AM

హైదరాబాద్‌ : వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీల ఆడిటర్, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయిరెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకున్న ల్యాప్‌ ట్యాప్‌ ఇప్పించాలన్న సువర్ణభూమి పిటిషన్‌ను ఏసీబీ న్యాయస్థానం తోసిపుచ్చింది. ల్యాప్‌ ట్యాప్‌ అవసరం లేకపోతే మార్చి 13లోగా సువర్ణభూమి సంస్థకు అప్పగించాలని సీబీఐకి కోర్టు ఆదేశించింది. ఒకవేళ ఇవ్వని పక్షంలో ఎందుకు ఇవ్వడం లేదన్న విషయాన్ని స్పష్టమైన కారణాలతో కోర్టుకు తెలియజేయాలని న్యాయమూర్తి బి.నాగమారుతిశర్మ చెప్పారు.
 

 ‘సాయిరెడ్డి మా సంస్థకు ఆడిటింగ్ నిర్వహించేవారు. ఇందులో భాగంగా కంపెనీ ఆర్థిక లావాదేవీలతో ఉన్న ల్యాప్‌టాప్‌ను ఆయన పరిశీలన కోసం పంపాం. అయితే, సాయిరెడ్డి అరెస్టు సమయంలో మా ల్యాప్‌టాప్‌ను కూడా సీబీఐ సీజ్ చేసింది’ అంటూ సువర్ణభూమి తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుతో తమకు సంబంధం లేదని, ల్యాప్‌టాప్‌ను ఇప్పించాలని పిటిషన్‌లో కోరారు. అయితే, సీజ్ చేసిన ల్యాప్‌టాప్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్ పరిశీలన కోసం పంపామని, ఈ కేసుకు సంబంధించిన సమాచారం అందులో లేకపోతే.. ల్యాప్‌టాప్ తిరిగి ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని సీబీఐ అప్పట్లో తెలిపింది. కాగా, సదరు ల్యాప్‌టాప్‌లో జగన్ కేసుకు సంబంధించిన సమాచారమేదీ లేదని ఎఫ్‌ఎస్‌ఎల్ సీబీఐకి తెలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం ల్యాప్‌టాప్‌ను సువర్ణభూమి సంస్థకు తిరిగి ఇచ్చేసే అవకాశముంది. ఎమ్మార్‌ కేసు నిందితుడు కోనేరు ప్రసాద్‌ బెయిల్‌ పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ న్యాయస్థానం కొట్టివేసింది.