TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జనరక్ మందులకు జనాధరణ కొరత

Published on: Fri Feb 24, 2012 12:41PM

హైదరాబాద్: ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన జనరిక్ మెడికల్ షాపులు జనాధరణ లేక వెలవెలబోతున్నాయి. వైద్యశాఖ పర్యవేక్షణలో ఇందిరా క్రాంతిపథం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్ షాపులు ప్రజల ఆదరాభిమానాలకు చూరగొనలేకపోతున్నాయి. వీటి ఏర్పాటు, ప్రయోజనాలపై అధికారులు తగిన ప్రచారం చేయలేకపోవడంతో వ్యాపారం సాగడం లేదు. ప్రముఖ కంపెనీల పేరెన్నికగన్న మందులను సైతం 80శాతం తక్కువ ధరకు విక్రయించే ఉద్దేశ్యంతో వీటిని ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో ఇద్దరు ఫార్మాసిస్టులను కూడా నియమించారు. జనరిక్ మందుల పట్ల ఆస్పత్రి వైద్యులు కూడా చిన్నచూపు చూస్తున్నారు. ఈ మందులు వాడితే రోగం నయమవుతుందన్న భోరోసాను వారు బాధితులకు కల్పించలేక పోతున్నారు. దీంతో ప్రైవేటు మందుల దుకాణాలు ఎప్పటిలా సందడిగా ఉంటున్నాయి.