అందుకే గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ చేర్చలేదు: సీఎం
Published on: Thu Feb 23, 2012 3:42PM
హైద
రాబాద్: తెలంగాణ చాలా సున్నితమైన అంశమని అందుకే గవర్నర్ ప్రసంగంలో ఆ అంశం చేర్చలేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం శాసనసభలో చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని తాము ఎప్పుడూ కించపర్చలేదని చెప్పారు. 95 లక్షల మందికి ఉపయోపడే విధంగా మేము విధానాలు రూపొందిస్తున్నామని, సమర్ధవంతమైన పాలన ప్రజలముందుకు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని కిరణ్ తెలిపారు. రాష్ట్రంలో గోదాంలు లేవని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని, గోదాములు నిర్మించలేదని వ్యాఖ్యానిస్తున్నాయని కానీ వాస్తవమేమిటంటే వ్యవసాయ ఉత్పత్తి బాగా పెరిగిందని, అందుకే గోదాములు సరిపోవడంలేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కొత్త గోదాముల నిర్మాణం ఆవశ్యకతనుగుర్తించామని, ఆ దిశగా నిర్మాణాలు అమలు చేయబోతున్నామని ఆయన చెప్పారు.


