కేసీఆర్ కు రేవంత్ బెస్ట్ ఆఫర్
Published on: Thu Feb 23, 2012 2:26PM
హై
దరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని తమ పార్టీలో విలీనం చేస్తారా అని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి కె. చంద్రశేఖర రావును ప్రశ్నించారు. తెరాసను తమ పార్టీలో విలీనం చేస్తే కెసిఆర్‌కు పోలిట్‌బ్యూరో సభ్యత్వం ఇస్తామని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అఖిల పక్ష సమావేశంలో తమ పార్టీ నేతలు ఏం చెప్పారో కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. తాము చిదంబరంతో భేటీలోనూ తెలంగాణనే కోరామన్నారు. అధికార కాంగ్రెసు పార్టీకి ఇబ్బందులు వచ్చినప్పుడల్లా టిఆర్ఎస్ వారిని అదుకుంటోందని అన్నారు.


