మంత్రి మోపిదేవికి బిగుసుకుంటున్న ఉచ్చు
Published on: Tue Feb 21, 2012 3:05PM
హై
దరాబాద్: మద్యం సిండికేట్ల వ్యవహారంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. ఎసిబి అదుపులో ఉన్న నున్న రమణ కీలక సమాచారం అందించాడు. మంత్రి తన ఇంట్లోనే రెండు గ్రూపుల తగాదాలు పరిష్కరించారని రమణ తెలిపాడు. ఆ రెండు గ్రూపుల మధ్య రాజీ కుదిర్చి మంత్రి మోపిదేవి పది లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఆయన ఆరోపించాడు. రమణ నేరాంగీకార పత్రంలో పేర్కొన్న విషయాలపై ఎసిబి అధికారులు దృష్టిసారించారు. మరో 14 మంది మద్యం వ్యాపారులపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.


