ఉప ఎన్నికలపై బాబు:చెప్పం..చూపిస్తాం!
Published on: Sat Feb 18, 2012 9:18AM
హైద
రాబాద్: ఉప ఎన్నికల్లో ఏం జరగనున్నదో పార్టీ పరంగా తాము చెప్పబోమని, చేసి చూపిస్తామని టిడిపి అధ్యక్షులు చంద్రబాబు అన్నారు. ఉప ఎన్నికలకు పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అందులో ఎవరికీ సందేహం అక్కర్లేదని చెప్పారు. శుక్రవారం టిడిఎల్పి కార్యాలయంలో ఆయన ఉప ఎన్నికలపై పై విధంగా స్పందించారు. ఉపపోరు జరిగే నియోజకవర్గాల్లో తాను ప్రచారం చేస్తానన్నారు. అందుకు తగిన విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి డిపాజిట్ రాదని వస్తున్న ప్రచారాన్ని వమ్ము చేస్తామని చెప్పారు. ఉపఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలు తమ పార్టీ పోటీ చేసే సీట్లేనన్నారు.


