TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సహకార రాజకీయ సందడి

Published on: Fri Feb 17, 2012 9:36AM

హైదరాబాద్: రాష్ట్రంలో సహకార ఎన్నికలు మె నెలలోగా నిర్వహిస్తారన్న సమాచారంతో గ్రామీణ ప్రాంత సహకార రాజకీయాల్లో కదలిక కనిపిస్తోంది. మే  నెలలో 2864 వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల నిర్వహణకయ్యే ఖర్చంతా ఆయా సహకార సంఘాలే భరించాలి. ప్రస్తుతం 1200 సహకార సంఘాలు ఎన్నికల నిర్వహణా భారాన్ని తేలికగా మోసే స్థితిలో ఉన్నాయి. మరో 600 సహకార సంఘాల ఆర్ధిక స్థితి కొంతవరకు పరవాలేదు. మిగిలిన సుమారు 1000 సహకార సంఘాలు ఎన్నికల ఖర్చును మోయలేని దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయి. అయినా ఇవి కూడా ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. ఓటర్ల జాబితాతో పాటు ఇతర ఎన్నికల ఏర్పాట్లతో సహకారశాఖ ఇప్పటికే సిద్దంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ఉండటంతో మే నెల లోపు ఎన్నికలు జరుగుతాయన్న నమ్మకంతో ఆశావహులున్నారు.