ఫలించిన చర్చలు..జూడాల సమ్మె విరమణ
Published on: Wed Feb 15, 2012 8:45AM
హైద
రాబాద్ : ప్రభుత్వం, జూనియర్ డాక్టర్ల మధ్య ఎట్టకేలకు చర్చలు ఫలించాయి. జూడాలు సమ్మెను తాత్కాలికంగా విరమించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించటంతో జూడాలు దీక్షను విరమిస్తున్నట్లు తెలిపారు. రాత్రి నుంచి తెల్లవార్లు జరిగిన చర్చలు ఫలించటంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించడంతో జూడాలు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. అయితే కొన్ని షరతులకు లోబడి కాలాఫ్ చేస్తున్నట్టు చెప్పారు. డిమాండ్ల పరిష్కారానికి సంబంధించి రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని జూడాలు కోరారు. అప్పటి వరకు సమ్మెను తాత్కాలికంగానే విరమిస్తున్నామన్నారు.


