TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రభుత్వం అన్నిటికీ భయపడుతుంది శోభ

Published on: Tue Feb 14, 2012 9:09AM

హైదరాబాద్: ప్రభుత్వం కేవలం ఉపఎన్నికలకు మాత్రమే భయపడటం లేదని ఏ ఎన్నికలకు వెళ్లాలన్నా భయపడుతోందని  జగన్ వర్గం ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి  అన్నారు. అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన తమపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తీసుకు వచ్చామని ఆమె చెప్పారు. తమపై చర్యలు తీసుకోనందున ప్రత్యేక గ్రూపుగా తమను పరిగణించాలని కోరుతున్నామన్నారు. అనర్హత విషయంలో మేం ఎంత వరకు చేయాలో అంత చేశామన్నారు. నిర్ణయం స్పీకర్ పైనే ఉందన్నారు. రైతాంగానికి అండగా ఉండేందుకే తాము అప్పుడు అవిశ్వాసానికి మద్దతుగా ఓటేశామన్నారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న  వైయస్ జగన్మోహన్ రెడ్డిని తాము స్ఫూర్తిగా తీసుకొని అసెంబ్లీలో సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కాగా శోభా నాగి రెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు లేఖ రాశారు. తనను స్వతంత్ర ఎమ్మెల్యేగా గుర్తించాలని ఆమె లేఖలో కోరారు. అలాకాని పక్షంలో రాజీనామా ఆమోదించాలన్నారు. రాజీనామా ఆమోదించని పక్షంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా తనను గుర్తిస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనుబంధ సభ్యురాలిగా కొనసాగుతానని లేఖలో తెలిపారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విలువలను తేల్చేది కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కాదని ప్రజలని అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి మంగళవారం అన్నారు. దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీయే స్వయంగా కాంగ్రెసుతో విభేదించి కొత్త పార్టీ పెట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు.