TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అసెంబ్లీని అడ్డుకుంటే తెలంగాణ రాదు:శ్రీధర్‌బాబు

Published on: Sun Feb 12, 2012 11:03AM

హైదరాబాద్‌ : అసెంబ్లీని అడ్డుకున్నంత మాత్రాన తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రేపటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు. ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకం చర్చతో పాటు బడ్జెట్‌ పద్దులపైన చర్చ జరగాలన్నదే తమ అభిమతమని ఆయన తెలిరు. రాజకీయ నేతలు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడం సహజమేనని, విపక్షాల నుంచి సహేతుక విమర్శలు వస్తే స్వాగతిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో చిన్న చిన్న అభిప్రాయాలు సర్దుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.