TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్పీకర్ నాదెండ్ల పై లేఖాస్త్రం సంధించిన విజయమ్మ

Published on: Sat Feb 11, 2012 4:27PM

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్కు మరోసారి లేఖ రాశారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులపై సభా సంఘం వేయడం పట్ల ఆమె అభ్యంతరం తెలిపారు. మరణించిన వ్యక్తిపై విచారణలా అని ఆమె ప్రశ్నించారు. 1994 నుంచి జరిగిన భూకేటాయింపులపై విచారణ జరిపించాలని, అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయని ఆమె అన్నారు. సభా సంఘం ఏర్పాటు తనను దిగ్ర్భాంతి కలిగించిందని పేర్కొన్నారు. కాగ్, లోకాయుక్తలే మహానేత డాక్టర్ వైఎస్ని వేలెత్తి చూపలేదని గుర్తు చేశారు. నిర్ణయం తీసుకున్న 11 నెలల తర్వాత సభా సంఘం వేయడం పట్ల ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సభా సంఘం విధివిధానాల్లో కూడా స్పష్టం లేదని ఆమె అన్నారు. కృష్ణపట్నం, గంగవరం ఓడరేవులు, రహేజా, ఓడ చెరువు, ఎమ్మార్, శంషాబాద్ విమానాశ్రయం, ఆరు పవర్ ప్రాజెక్టులు, కాకినాడ సీపోర్టు, విశాఖ ప్రాజెక్టు, ఎంఐజి భారత్ వంటి పలు ప్రాజెక్టులకు భూకేటాయింపులు జరిగాయని ఆమె శనివారం నాదెండ్ల మనోహర్‌కు రాసిన లేఖలో తెలిపారు. ఐఎఎస్లను మాత్రమే సిబిఐ విచారించడం తనకు బాధ కలిగించిందన్నారు. ఇతరులను ఎందుకు విచారించడంలేదని ఆమె ప్రశ్నించారు.