జగన్ కు రెడ్ కార్పెట్..మా పైకి రాళ్లు
Published on: Sat Feb 11, 2012 1:53PM
హై
దరాబాద్: తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు రెడ్ కార్పెట్ పరిచారని, తమపైకి రాళ్లు విసిరారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాదులో శనివారం బైక్ ర్యాలీ నిర్వహించిన ఆయన కొంపల్లిలో జరిగిన యువజన సదస్సులో మాట్లాడారు. తాము తిన్నది తక్కువేనని, పెద్ద తిమింగిలాలను పట్టుకోవాలని ఐఎఎస్ అధికారులు అంటున్నారని గుర్తు చేస్తూ దీనికి వైయస్ జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు చూస్తుంటే కుంభకోణాలు, హత్యలే గుర్తుకొస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. లక్ష కోట్ల రూపాయలు దిగమింగి లక్ష విగ్రహాలు స్థాపిస్తున్నారని ఆయన అన్నారు. పోలవరం టెండర్ల రద్దు తమ విజయమేనని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అభివృద్ధి జరిగిందని, దీనిపై తాము కాంగ్రెసుతో బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్లు వ్యవహడరిస్తున్నారని ఆయన అన్నారు. బాంబులకే భయపడలేదు, ప్రాణాలను లెక్క చేయలేదని, వీరి బెదిరింపులకు భయపడేది లేదని ఆయన అన్నారు. కుటుంబ సభ్యుల కన్నా తనకు పార్టీ కార్యకర్తలే ముఖ్యమని ఆయన అన్నారు. యువతకు నాయకత్వం అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు.


