TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ లో విబేధాలను బయటపెట్టిన చిరంజీవి

Published on: Fri Feb 10, 2012 8:58AM

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి అన్నారు. తిరుపతి పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో ఉన్న విభేదాలపై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి గులాం నబీ ఆజాద్ దృష్టి సారిస్తున్నారని ఆయన అన్నారు. అందువల్ల వీటిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో మోపిదేవిపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని చిరంజీవి అన్నారు. తిరుపతిని మురికివాడలు లేని పట్టణంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. ఇదిలావుండగా, రాష్ట్రంలోని మద్యం సిండికేట్ల నుంచి ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ ముడుపులు తీసుకున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తమన్నారు. సమస్యను పక్కదారి పట్టించేందుకు కొందరు వ్యక్తులు ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తారన్నారు.