TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎంపీలతో సీఎం మీటింగ్

Published on: Thu Feb 9, 2012 2:37PM

హైదరాబాద్: కేంద్రం నుండి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పెండింగ్ ప్రాజెక్టులను తీసుకు వచ్చేందుకు ఎంపీలంతా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు. ఈ నెల 15న రాష్ట్రానికి రైల్వే మంత్రి రానున్న నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై ఆయనతో చర్చించుతామని చెప్పారు. రైల్వే ప్రాజెక్టులను సమష్టిగా కృషి చేసి సాధిద్దామన్నారు. ఎంపీలతో పాటు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సుదర్శన్ రెడ్డి ఉంటారని చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ టి సుబ్బిరామి రెడ్డి మాట్లాడుతూ.. విశాఖను ప్రత్యేక రైల్వే జోన్‌గా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు ఎంపీలంతా సమష్టిగా కృషి చేయాలన్నారు. గత బడ్జెట్‌లో అమలుకు నోచుకోని కొత్త రైళ్లు, రైల్వే మార్గాలు, విద్యుదీకరణ, డబ్లింగ్ పనులు తదితర అంశాలను ఈ భేటీలో చర్చించారు. ఈ సమావేశానికి పదహారు మంది ఎంపీలు హాజరయ్యారు. మీడియాకు అనుమతి నిరాకరించారు. కాగా ముఖ్యమంత్రి సమావేశంపై టిడిపి మండిపడింది. కేవలం మొక్కుబడి కోసం కంటితుడుపు చర్యగా మాత్రమే సమావేశం ఏర్పాటు చేశారని ఆరోపించింది.