TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విస్తరణకు రాజకీయరంగు పులమొద్దు మీడియాకు సీఎం

Published on: Tue Feb 7, 2012 3:29PM

హైదరాబాద్: మంత్రి వర్గ విస్తరణకు రాజకీయాలు అంటగట్టవద్దని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం సూచించారు. మంత్రి వర్గ విస్తరణపై మీడియాలో భిన్నమైన కథనాలు వస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. శాఖల కేటాయింపులో ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదన్నారు. ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ముగ్గురిని మంత్రి వర్గంలోకి తీసుకున్నట్టు చెప్పారు. పాలనాపరమైన వెసులుబాటు కోసమే మంత్రివర్గంలో స్వల్ప మార్పులు చేర్పులు చేశామన్నారు. కేబినెట్ టీం వర్క్‌తో పని చేస్తుందని సిఎం చెప్పారు.