TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ విద్యార్ధులకు ఊరట..కేసులు ఎత్తివేయాలని సీఎం ఆదేశం

Published on: Tue Feb 7, 2012 3:24PM

హైదరాబాద్: ప్రాంతీయ ఉద్యమాల కేసులు ఎత్తి వేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు మంగళవారం సూచించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాంతీయ ఉద్యమాల కేసులు సాధ్యమైనన్ని ఎత్తివేయాలని వారిని ఆదేశించారని సమాచారం. ఈ కేసుల ఎత్తివేత కూడా బడ్జెట్ సమావేశాలలోగా పూర్తి చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే ఎత్తివేత సమయంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాలని సూచించారని తెలుస్తోంది. ఉద్యోగార్థులైన విద్యార్థులపై పెట్టిన కేసులు వెంటనే తేల్చాలని, వారిని వేధించవద్దని సూచించినట్లుగా తెలుస్తోంది. త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల భద్రతా చర్యల పైనా ఆయన సమీక్షలో చర్చించారు. కాగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తి వేయాలని తెలంగాణవాదులు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.