TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీనియర్ గా గుర్తించారు కాబట్టే పదవి మంత్రి ఉత్తమ్

Published on: Tue Feb 7, 2012 2:03PM

హైదరాబాద్: సీనియర్ ఎమ్మెల్యేగా గుర్తించారు కాబట్టే తనకు మంత్రి పదవి ఇచ్చినట్లుగా తాను భావిస్తున్నట్లు  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అందరిని కలుపుకుపోయి పని చేస్తానని ఆయన అన్నారు. జిల్లా నేతలలో ఎవరితో తనకు విభేదాలు లేవన్నారు. గతంలో తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వర్గం శాసనసభ్యులకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చినప్పుడు అన్యాయం జరిగిందని, ఇప్పుడు పదవులు తీసుకోవడాన్ని తప్పు పట్టడం ఏమిటని  మంగళవారం ఆయన తెలంగాణవాదులను ప్రశ్నించారు. పదవులు తీసుకోవద్దని చెప్పడం సరికాదన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పటికీ తెలంగాణ కోసం పని చేస్తానన్నారు. పార్టీ అధిష్టానంతో ప్రత్యేక తెలంగాణపై చర్చిస్తానని అన్నారు. దామోదర రెడ్డికి కూడా మంత్రి పదవి వస్తే బాగుండేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో పేదలందరికీ సొంత ఇళ్లు నిర్మించడమే తన లక్ష్యమన్నారు.