TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సబిత నా 9వ సిస్టర్..విభేదాలు మీడియా సృష్టే మంత్రి ప్రసాద్

Published on: Tue Feb 7, 2012 1:55PM

హైదరాబాద్: సబితా ఇంద్రా రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని మంత్రి ప్రసాద్ కుమార్ అన్నారు. తనకు ఎనిమిది మంది సోదరీమణులు ఉన్నారని, హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని తన తొమ్మిదో సోదరి అనుకుంటున్నానని మంగళవారం ఓ ఛానల్ ముఖాముఖిలో అన్నారు. ఆమెతో విభేదాలు కేవలం మీడియా, పత్రికల సృష్టేనన్నారు. ఇటీవల జరిగిన సబిత కార్యక్రమానికి తాను హాజరు కాకపోవడానికి విభేదాలు కారణం కాదన్నారు. తన మంత్రి పదవి స్వీకారోత్సవం సందర్భంగా ఆమె హాజరు కాకపోయినప్పటికీ తనకు అభినందనలు తెలియజేశారన్నారు. అందరినీ కలుపుకొని పోయి పని చేస్తానని అన్నారు. మాజీ మంత్రి శంకర రావు స్థానంలో తనను కేబినెట్లోకి తీసుకోలేదన్నారు. తెలంగాణలో తన సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధిని తానేనని అన్నారు. రాజీనామాలతో తెలంగాణ రాదని అన్నారు.