TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సచివాలయంలో కొత్త గేమ్‌..ఐఏఎస్ ల మరో సంచలన నిర్ణయం

Published on: Tue Feb 7, 2012 9:28AM

హైదరాబాద్: ఐఏఎస్ అధికారులు అన్నంత పనీ చేస్తున్నారు. మంత్రులకు దాదాపుగా సహాయ నిరాకరణ ప్రకటించారు. తప్పైనా ఒప్పైనా కేబినెట్ తీసుకునే నిర్ణయాలకు బాధ్యత తమది కాదని తేల్చి చెప్పేశారు. దీంతో, ఇప్పుడు సచివాలయంలో కొత్త గేమ్‌ మొదలైంది. కోట్లకు కోట్లు నొక్కేసిన మంత్రుల్ని వదిలేసి.. సీబీఐ  తమను టార్గెట్ చేస్తోందంటూ ఇప్పటికే మీడియాకెక్కిన ఐఎఎస్ లు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మంత్రులు నోటిమాటగా చెప్పే ఆదేశాల్ని అమలు చేయడం తమ బాధ్యత కాదని తేల్చి చెప్పేశారు. మౌఖిక ఆదేశాలను పాటించబోమని కరాఖండీగా చెప్పేస్తున్నారు.

తాజాగా ఓ మంత్రిగారు పంపిన ఫైల్లో ట్రాన్స్‌ఫర్‌ విషయంలో నిబంధనలు సరిగ్గా లేవని దాన్ని తిప్పి పంపేశారు ఇద్దరు ఐఏఎస్‌లు. క్యాబినెట్ నిర్ణయాలకు మంత్రులు బాధ్యత వహించాలా.. లేక వాటిని అమలు పరిచే లు దానికి బాధ్యులా అన్న అంశంపై వాడివేడి చర్చ జరుగుతున్న టైమ్‌లో.. బ్యూరోక్రాట్లు ఈ నిర్ణయానికి రావడం విశేషం. నిబందనలకు అనుకూలంగా ఉంటేనే ఫైళ్లు పుటప్ చేస్తామంటూ ఇప్పటికే అన్ని శాఖల్లోనూ ఐఏఎస్‌లు తేల్చి చెప్పినట్టు సమాచారం. వర్క్ టు రూల్ అంటు మంత్రులకు ముచ్చెమటులు పోయిస్తున్నారు. తమను ప్రొటెక్టు చేయలేని మంత్రులకు .. తామేందుకు సహకరించాలని సీనియర్ ఐఎఎస్ లు వాపోతున్నారు. అధికారులు, మంత్రులు ఇలా పంతాలకు పోతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.