నేడు కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు
Published on: Mon Feb 6, 2012 10:50AM
హైద
రాబాద్: కేబినేట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. సోమవారమే కేబినేట్ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాల సమాచారం. కేబినెట్ విస్తరణ ప్రక్రియకు సోమవారం సాయంత్రం ముహూర్తం ఖరారైంది. ఈ కేబినెట్ విస్తరణలో భాగంగా మంత్రివర్గంలోకి ముగ్గురికి అవకాశం కల్పించనున్నారు. కొత్తగా తెరపైకి పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది. కానీ ఉత్తమ్ కుమార్, ప్రసాద్ కుమార్‌లకు బెర్తులు ఖరారయ్యాయి. ఇక కోస్తా నుంచి మరొకరి ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలిసింది. కోస్తా నుంచి కొండ్రు మురళీకి ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. కేబినెట్‌లోకి తీసుకోలేకపోతున్నామని గండ్రతో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు సమాచారం.


