TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్న కేసీఆర్

Published on: Mon Feb 6, 2012 9:08AM

హైదరాబాద్: మార్చి తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో పార్టీ కార్యకర్తలతో ఆయన ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని స్పష్టం చేశారు. మార్చి తర్వాత ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు. అలాగే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రతి మండలంలో వసతి గృహంతో కూడిన రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రాంతంలో కొత్తగా 40 సింగరేణి గనులు ఏర్పాటు చేసి యాభై వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన చెప్పారు.