TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇక నిర్ణయం జూడాలదే తేల్చి చెప్పిన డీఎల్

Published on: Sat Feb 4, 2012 11:19AM

హైదరాబాద్: జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెను రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి డి.ఎల్.రవీంద్రారెడ్డి అభివర్ణించారు. జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమిస్తేనే చర్చలు జరుపుతామని డీఎల్ స్పష్టం చేశారు. ఇప్పటికే జూడాలతో అన్నీ చర్చలు జరిపామని, ఇక నిర్ణయం జూడాల చేతుల్లోనే ఉందని డీఎల్ తేల్చి చెప్పేశారు.  జూనియర్ డాక్టర్ల నిరసన విశాఖపట్నంలో ప్రారంభమై క్రమంగా రాష్ట్రమంతా వ్యాపించిందని ఆయన చెప్పారు. గత ప్రభుత్వాలు స్టయిఫండ్ చెల్లింపులో జాప్యం చేస్తూ పెండింగులో ఉంచాయని, తాను వచ్చిన తర్వాత స్టయిఫండ్ చెల్లింపులను క్రమబద్ధం చేశానని ఆయన చెప్పారు. జూడాల సమ్మెకు మద్దతు తెలిపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి జూడాలంటే కూడా తెలియదని డీఎల్ ఎద్దేవా చేశారు. ఎంసిఎ నియమావళి ప్రకారం జూడాలకు స్టయిఫండ్ ఇవ్వాలని జగన్ అంటున్నారని, ఎంసిఎ నియమావళిలో జూడాల వేతనాల గురించి ఎక్కడా చెప్పలేదని, ఎంసిఎ సీట్లు తదితర విషయాల గురించి మాత్రమే మాట్లాడుతుందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

ఇదిలా ఉంటే.. తమ డిమాండ్ల సాధనకు గాంధీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శనివారంతో 11వ రోజుకు చేరుకుంది. న్యాయమైన తమ డిమాండ్ల పరిష్కార విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని జూనియర్ వైద్యుల సంఘం నేతలు విమర్శిస్తున్నారు.