TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

48గంటల నిరాహార దీక్షకు జగన్ శ్రీకారం

Published on: Sat Feb 4, 2012 9:40AM

హైదరాబాద్: రాష్ట్రంలో చేనేత కార్మికుల సమస్యలపై 48 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించారు. రాజమండ్రి దేవాంగుల సభలో వైఎస్.జగన్ మాట్లాడుతూ చేనేతల కోసం ఉత్తమ విధానాన్ని రూపొందిస్తామన్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 12 వ తేదిన ధర్మవరంలో నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు అన్ని వర్గాల ప్రజలను వేధిస్తోందని ఆయన ఆరోపించారు. దేశానికి వెన్నెముక వంటి రైతన్నలను కోలుకోలేని విధంగా దెబ్బతీసిందని జగన్ మండిపడ్డారు. వైఎస్.జగన్మోహన్‌ రెడ్డి శనివారం నాటి పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు తండ్రి శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు. దీంతో ప్రసాదరాజు కుటుంబాన్ని పరామర్శించడానికి శనివారం పాలకొల్లు వెళ్లనున్నారు.