హస్తిన బాటపట్టిన సీఎం కిరణ్
Published on: Sat Feb 4, 2012 8:25AM
హై
దరాబాద్: కేంద్ర అధిష్టానాన్ని కలిసేందుకు ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణే ప్రధాన అజెండాగా ఆయన ఢిల్లీలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఇతర కేంద్ర నాయకుల్ని కలవనున్నారు. తెలంగాణా ప్రాంతానికి చెందిన ఖాళీలను భర్తీ చేయడంతోపాటు ప్రస్తుత మంత్రివర్గంలో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. ఎవరైనా తొలగింపునకు అధిష్టానం అనుమతించని పక్షంలో కనీసం శాఖల మార్పయినా ఉండాలన్న భావనతో సీఎం ఉనట్లు కనిపిస్తోంది. రాష్ట్ర బడ్జెట్, తదితర అంశాలపై కూడా అధిష్టానంతో ముఖ్యమంత్రి చేర్చించే అవకాశముంది.


