TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సునీల్ రెడ్డి కస్టడీ పొడిగింపును తోసి పుచ్చిన కోర్టు

Published on: Mon Jan 30, 2012 3:48PM

హైదరాబాద్: ఎమ్మార్ కేసులో ఇటీవల అరెస్టైన సునీల్ రెడ్డి కస్టడీ పొడిగింపు విషయంలో సిబిఐకి ప్రత్యేక న్యాయస్థానంలో సోమవారం చుక్కెదురైంది. సునీల్ రెడ్డి కస్టడీ పొడిగించాలని సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. మరో ఏడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు కస్టడీ పొడిగింపు పిటిషన్‌ను తోసి పుచ్చింది. సునీల్ రెడ్డికి బుధవారం వరకు కోర్టు రిమాండ్ విధించింది. కాగా సునీల్ రెడ్డిని రెండున్నర రోజుల పాటు కోర్టు సిబిఐ కస్టడీకి ఇటీవల ఇచ్చింది. సోమవారంతో కస్టడీ ముగియడంతో సిబిఐ ఆయనను కోర్టులో ప్రవేశ పెట్టింది. అయితే కస్టడీ పొడిగించేందుకు అనుమతించలేదు. మరోవైపు విజయ రాఘవను తమ కస్టడీకి ఇవ్వాలన్న సిబిఐ పిటిషన్‌ను కూడా కోర్టు డిస్మిస్ చేసింది.