TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సత్తా చూపిన ఏసీబీ..కటకటాల్లో సిండి'కేట్లు'

Published on: Sun Jan 29, 2012 8:58AM

హైదరాబాద్: మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) దాడులతోపాటు అరెస్టుల్ని ఉధృతం చేసింది.  ఓవైపు మద్యం సిండికేట్ వ్యాపారులు, వారి గుమాస్తాలు.. మరోవైపు ఎక్సైజ్ అధికారులను అరెస్టు చేసింది. ఐదు జిల్లాల్లో 22 మంది వ్యాపారులను, మరో ఏడుగురు అధికారులను జైళ్లలో పెట్టింది. ప్రభుత్వాదాయానికి గండి కొట్టడం, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం వ్యాపారం చేయడం, మామూళ్లు ఇస్తూ లంచాల్ని ప్రోత్సహించడం తదితర ఆరోపణలతో వీరిని అరెస్టు చేశారు. ఎక్సైజ్ శాఖలో కింది నుంచి పై స్థాయి వరకు అందరికీ లంచాలు ఇచ్చినట్లు ఆధారాలు లభించాయి. చాలాచోట్ల అరెస్టుల సందర్భంగా ఏసీబీ అధికారులు తయారుచేసిన రిమాండు రిపోర్టులలో అధికారుల పేర్లు రాకపోయినా, ప్రాంతాల వారీగా ఎక్సైజ్ సీఐలు, ఏసీలు, డీసీలు, ఈఎస్‌లు, సిబ్బంది ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. దాని ప్రకారం దోషులను గుర్తించి అరెస్టు చేస్తామని ఏసీబీ ప్రకటించడంతో ఎక్సైజ్ శాఖలో కలకలం మొదలైంది. ఈ అరెస్టులపై మద్యం వ్యాపారులు మండిపడ్డారు. తాము పారదర్శకంగా వ్యాపారాలు చేసుకుంటున్నామని, తమ ద్వారా ప్రభుత్వం వేల కోట్ల ఆదాయం గడిస్తూ తమను దొంగల్లా అరెస్టు చేయడమేంటని నిలదీశారు. సిండికేట్ నేతల అరెస్టు చేయడంపై మద్యం దుకాణాల యజమానులు నిరసన తెలిపారు. శనివారం దుకాణాలను తెరవలేదు.