TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

13 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Published on: Wed Jan 25, 2012 8:53AM

హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలను వచ్చేనెల 13వ తేదీ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఫిబ్రవరి 17న బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావిస్తోంది. అసెంబ్లీ, శాసనమండలి సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడం ఆనవాయితీ. గవర్నర్ నరసింహన్‌ను సంప్రదించాక ఈ నెల 30న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు తుది నిర్ణయం తీసుకోనున్నారు.