TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బాలకృష్ణ తెలంగాణ పర్యటనపై ఉత్కంఠ

Published on: Mon Jan 23, 2012 2:49PM

హైదరాబాద్: హీరో బాలకృష్ణ గత కొన్ని రోజులుగా సీమాంధ్రలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎల్ రమణ, బాలకృష్ణ తెలంగాణలో పర్యటించాలని, ఆయన ఎప్పుడైనా రావొచ్చునని చెప్పారు. దీంతో బాలకృష్ణ తెలంగాణ పర్యటనపై చర్చ ప్రారంభమైంది. తెలంగాణ విషయంలో కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని, తమకు ఇరు ప్రాంతాలు సమానమేనని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. అందువల్ల బాలకృష్ణ తెలంగాణ పర్యటన ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అయితే ఇటీవల అదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబుకు అంత వ్యతిరేకత కనిపించలేదు. దీంతో తెలంగాణ ప్రాంతంలో ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే టిడిపి తెలంగాణ నేతలు బాలయ్యను రావాల్సిందిగా ఆహ్వానించినట్లు కనిపిస్తోంది.