TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మళ్లీ రాజకీయాల్లోకి వస్తా కృష్ణంరాజు

Published on: Fri Jan 20, 2012 2:27PM

హైదరాబాద్: తాను మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని, ఏ పార్టీలో చేరుతాననేది తర్వాత చెప్తానని ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అన్నారు. తన జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఏ పార్టీ సరిగా లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ పార్టీకి కూడా సిద్ధాంతాలు, విధానాలు ఉన్నట్లు అనిపించడం లేదని, ఏ పార్టీ బాగుందో చెప్పడం కూడా కష్టంగానే ఉందని ఆయన అన్నారు. గతంలో ఆయన బిజెపిలో చేరి, కేంద్ర మంత్రి పదవిని కూడా చేపట్టారు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన తర్వాత అందులో చేరారు. చిరంజీవితో పొసగక పోవడంతో బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. తాను నటించిన భక్త కన్నప్ప సినిమాను ప్రభాస్‌తో రీమేక్ చేయనున్నట్లు కూడా చెప్పారు. తాను సినిమాలకు దర్శకత్వం వహిస్తానని చెప్పారు. మితిమీరిన బడ్జెట్‌తో సినిమాలు నిర్మించడం సరి కాదని ఆయన అన్నారు.