TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జనం నెత్తిన కరెంటు పిడుగు

Published on: Wed Jan 18, 2012 9:15AM

హైదరాబాద్: 2009 అసెంబ్లీ ఎన్నికల ముందు అధిక ధరకు బయటి నుంచి కరెంటు కొనడం, విదేశీ బొగ్గును వినియోగించడంతో డిస్కమ్‌లపై భారీ స్థాయిలో భారం పడింది. అప్పుడు వసూలు చేసిన చార్జీలకు, అప్పట్లో తాము ఇంధనంపై పెట్టిన ఖర్చుల మధ్య తేడానే ఇంధన సర్దుబాటు (ఎఫ్ఎస్ఏ)ల రూపంలో డిస్కమ్‌లు వసూలు చేయనున్నాయి. దీనిపై మంగళవారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ (ఈఆర్‌సీ) ఆదేశాలు జారీ చేసింది. 2008-09లో 3,141.97 కోట్లు ఎఫ్ఎస్ఏ వసూలుకు అనుమతించాల్సిందిగా డిస్కమ్‌లు ఈఆర్‌సీని కోరాయి. అయితే... 1638.82 కోట్ల వసూలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిని గృహేతర, వ్యవసాయేతర వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. 2008-09కి సంబంధించిన గృహ వినియోగదారుల ఎఫ్ఎస్ఏ రూ.500 కోట్లను భరించేందుకు సర్కారు సిద్ధపడింది. సోమవారం ఈ విషయాన్ని ఈఆర్‌సీకి లిఖితపూర్వకంగా తెలిపింది. అయితే... గృహ వినియోగదారులను మాత్రమే ఎఫ్ఎస్ఏ నుంచి మినహాయించడంపై హైకోర్టులో కేసు నడుస్తోంది. ఒకవేళ కోర్టులో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే... రూ.500 కోట్ల ఎఫ్ఎస్ఏను గృహ వినియోగదారుల నుంచే వసూలు చేస్తారు. ఇక... 2009-10లో 1480.01 కోట్ల రూపాయలను ఎఫ్ఎస్ఏగా వసూలు చేసుకుంటామని డిస్కమ్‌లు ప్రతిపాదించాయి. ఈఆర్‌సీ రూ.1400.07 కోట్ల వసూలుకు ఓకే చెప్పింది. ఇందులో ఎల్టీ వ్యవసాయ వినియోగదారులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. అంటే... గృహ వినియోగదారులతో సహా అందరిపైనా భారం తప్పదు. ఈఆర్‌సీ అనుమతి లభించడంతో ఇక డిస్కమ్‌లు బాదుడుకు సిద్ధమవుతున్నాయి. 2009-10 సంవత్సరం ఎఫ్ఎస్ఏను యూనిట్‌కు సగటున 34 పైసలు వసూలు చేస్తారు. ఫిబ్రవరి నెల బిల్లు నుంచే ఇది మొదలవుతుంది. గృహేతర వినియోగదారులు 2008-09, 2009-10 సంవత్సరాల ఎఫ్ఎస్ఏను యూనిట్‌కు 78 పైసల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.