TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అలా చేస్తే బాబు కింద అటెండర్‌గా పని చేస్తా

Published on: Thu Jan 12, 2012 1:59PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ ఇస్తే ఆయన వద్ద అటెండర్‌గా పని చేస్తానని తెలంగాణ రాష్ట్ర సమితి నేత టి.హరీష్ రావు అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్టు చంద్రబాబు కేంద్ర హోం మంత్రి చిదంబరానికి లేఖ ఇవ్వాలని కోరారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న వనరులను దోచుకునేందుకే సీమాంధ్ర నేతలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర నాయకులే తెలంగాణ నేతల్లో చీలికలు తెస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు.