ఉపఎన్నికల్లో బాలయ్య సత్తా చూపించాలి
Published on: Sun Jan 8, 2012 4:10PM
హైద
రాబాద్: సినీ హీరో బాలకృష్ణకు రాజకీయాల్లోకి రావాలనే ఉత్సాహం అంతగా ఉంటే ఇంకా ఆలస్యమెందుకని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత రుద్రరాజు పద్మరాజు ఆదివారం సూచించారు. బాలయ్యకు అంతగా ఉత్సాహం ఉంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చూపించుకోవాలని సవాల్ విసిరారు. ప్రజాకర్షణ ఉన్న బాలయ్యకు ఉప ఎన్నికలే అసలైన వేదిక అన్నారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసి బాలయ్య తన జనాకర్షణ నిరూపించుకోవాలని శాసనమండలి సభ్యుడు రంగారెడ్డి అన్నారు. కాగా కృష్ణా జిల్లా పర్యటనలో బాలకృష్ణ తాను త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని, 2014 ఎన్నికల్లో పోటీ చేస్తానని, అప్పుడు టిడిపియే అధికారంలోకి వస్తుందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.


