TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణపై కాంగ్రెసు తప్పించుకోలేదు:సర్వే

Published on: Sun Jan 8, 2012 3:55PM

హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇచ్చే పరిస్థితి నుండి తప్పించుకోలేదని ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ ఆదివారం అన్నారు. ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2009 ఎన్నికల్లో తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెసు ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చిందని, 2014 ఎన్నికల్లో రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఎన్నికల్లోకి వెళతామన్నారు. తెలంగాణ ఇవ్వని పక్షంలో ప్రజలు కాంగ్రెసును సహించరన్నారు. తెలంగాణపై కేంద్రం కూడా ప్రకటన చేసిందన్నారు. ఇతర పార్టీల పేరు చెప్పి తాము తప్పించుకోమన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలన బాగుందన్నారు. ఆయన హయాంలో పార్టీ బలపడుతోందన్నారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు వరంగల్ యాత్రను కొందరు అడ్డుకోవడం సరికాదని టిఆర్ఎస్‌ను ఉద్దేశించి అన్నారు. రేపు నిజామాబాద్ వస్తున్న జగన్‌ను కూడా అడ్డుకోవద్దన్నారు. యాత్రల వల్ల ప్రజలకు, రైతులకు మేరు జరిగితే మంచిదే కదా అన్నారు.