చంద్రబాబు యాత్రపై రగిలిన విజయశాంతి
Published on: Fri Jan 6, 2012 2:25PM
హైద
రాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై టిఆర్ఎస్ మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేని భద్రత ప్రతిపక్ష నేతకా అని ప్రశ్నించారు. తాము తెలంగాణ కోసం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని తదితరులను నిలదీశామన్నారు. ప్రధానినే నిలదీసిన తమకు బాబు ఓ లెక్క కాదన్నారు. అరెస్టు చేసిన టిఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తుంటే చంద్రబాబు సంతోషిస్తున్నారని విమర్శించారు. తాను సోనియా ఇంటి ముందు ధర్నా చేసేందుకు సిద్ధమని బాబు వస్తారా అని సవాల్ విసిరారు. తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ మాట్లాడినా నిలదీస్తామన్నారు. తెలంగాణకు అనుకూలమైతే చంద్రబాబు హోంమంత్రి చిదంబరానికి లేఖ రాయాలన్నారు.


