శ్రీలక్ష్మికి సుప్రీంలో ఎదురుదెబ్బ..మళ్ళీ జైలుకే
Published on: Fri Jan 6, 2012 1:09PM
హై
దరాబాద్: గాలి జనార్దనరెడ్డికి చెందిన ఒఎంసీ గనుల కేసుకు సంబంధించి అరెస్ట్ అయి విడుదలైన శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బతగిలింది. ఆమె బెయిల్పై హైకోర్టు ఉత్తర్వులు యథాతథంగా అమలు అవుతాయని సుప్రీంకోర్టు పేర్కొంది. శ్రీలక్ష్మి బెయిల్ ని హైకోర్టు రద్దు చేసిన నేపధ్యంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వులు యథాతథంగా అమలు అవుతాయని పేర్కొంది. కాగా, స్టే కోసం శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 16 కు వాయిదా వేసింది. మరోవైపు శ్రీలక్ష్మి ఈరోజు (శుక్రవారం) సీబీఐ కోర్టులో లొంగిపోవాల్సి ఉంది.


