TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెట్రో పెంపుపై రాజధానిలో హైడ్రామా

Published on: Tue Jan 3, 2012 8:39AM

హైదరాబాద్‌ : పెట్రోల్‌ ధరల పెంపుపై న్యూఢిల్లీలో హైడ్రామా నడుస్తోంది. పెట్రోలు ధరలు పెంచాలంటూ కంపెనీలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. అయితే పెట్రో ధరల పెంపుదలను వాయిదా వేసుకోవాలని ఆయా చమురు కంపెనీలను ప్రభుత్వం కోరుతోంది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ క్షీణించడం, ముడి చమురు ధరలకు రెక్కలు రావడంతో పెట్రోల్‌ ధరను రెండు రూపాయలకు పైగా పెంచాలని చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ధరల పెంపు వాయిదా పడుతూ వస్తోంది. డిసెంబరు 15 నాటి సమీక్షలో లీటరుకు 65 పైసలు పెంచాలని తొలుత భావించాయి. అయితే రిజర్వ్‌ బ్యాంకు జోక్యంతో రూపాయి పతనాన్ని అడ్డుకుంది. దీంతో ఆయిల్‌ కంపెనీలు ధరల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్‌లో ఇప్పుడు రూపాయి పతనంతో పాటు ముడిచమురు ధరలు పెరగడంతో పెట్రోల్‌ ధరలు పెంచక తప్పదని కంపెనీలు పేర్కొంటున్నాయి. అయితే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న ఈ సమయంలో పెట్రో ధరలు పెంచడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, ఈ క్రమంలోనే ధరల పెంపుకు కేంద్రం విముఖత వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే రాజకీయ అవసరాల కోసం పెట్రోల్‌ ధరలు పెంపును అడ్డుకుంటుందన్న అభిప్రాయాన్ని రాజకీయవిశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.